VSP: వేట ముగించుకుని తిరిగి వస్తున్న మత్స్యకారుల బోటులో వ్యక్తి గల్లంతైన ఘటన విశాఖలో జరిగింది. జాలారిపేటకు చెందిన అప్పన్న ఈ నెల 16న మరో ఎనిమిది మంది మత్స్యకారులతో బోటులో వేటకు వెళ్లాడు. బుధవారం అర్ధరాత్రి విశాఖ తీరానికి 11 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా అప్పన్న కనిపించకుండా పోయినట్లు తోటి మత్స్యకారులు అధికారులకు సమాచారం అందించారు. ఘటనపై అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
సముద్రంలో మత్స్యకారుడి గల్లంతు


