హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చెత్త కుప్పగా మారిన మాధవరం చెరువు

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామ సమీపంలోని చెరువు చెత్తాచెదారంతో నిండిపోయింది. చెరువులో ప్లాస్టిక్‌ వ్యర్థాలు భారీగా పేరుకుపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. పశువులు ప్లాస్టిక్‌ పదార్థాలను తిని మృత్యువాత పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్త తొలగించాల్సిన పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.