హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

22న చంద్రంపాలెం స్కూల్‌కు మంత్రి లోకేష్

VSP: చంద్రంపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలకు ఈ నెల 22న మంత్రి నారా లోకేశ్ రానున్నారు. దివిస్ ల్యాబ్స్ యాజమాన్యం రూ.6.5 కోట్లతో పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రీడా కోర్టులు, ఫుట్ బ్రిడ్జి, డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధి పనులను ఆయన ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తారు. మొక్కలు నాటి, విద్యార్థులతో ముచ్చటిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.