హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

21వ తేదీ నుంచి పోలేరమ్మ తల్లి ఉత్సవాలు

NLR: వింజమూరు గ్రామ దేవత పోలేరమ్మ తల్లి ఉత్సవాలు ఈ నెల 21 నుంచి 23 వరకు యర్రబల్లిపాలెంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 21న గ్రామ దేవతల ఆహ్వానం, కోలాట ప్రదర్శన, 22న అమ్మవారి గ్రామోత్సవం, నాట్య, కోలాట ప్రదర్శనలు ఉంటాయి. 23న గ్రామ పొంగళ్లు, బండ్లు తిరగడం, సాయంత్రం 7.30 గంటలకు అన్న ప్రసాద వితరణ నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు భక్తులు పాల్గొనాలని కోరారు.