PPM: మక్కువ-దుగ్గేరు మార్గంలో కొండబుచ్చింపేట గ్రామం సమీపంలో రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడింది. నాలుగేళ్ల క్రితం నిర్మించిన ఈ రహదారికి సరైన నిర్వహణ లేకపోవడంతో గుంత ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు. గుంత లోతు కనిపించకపోవడంతో పలువురు వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారని చెప్పారు. అధికారులు వెంటనే గుంతను పూడ్చి ప్రమాదాలు నివారించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రహదారి మధ్యలో గుంత.. వాహనదారులకు దడ!


