హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాలూరులో ప్రపంచ దోమలు దినోత్సవం

PMM: ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సాలూరు డివిజన్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శివకుమార్ తెలిపారు. గురువారం ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా సాలూరులో ర్యాలీతో తహసీల్దార్ కూడలిలో మానవహారం నిర్వహించారు. దోమల నివారణకు లార్వా అణచివేతే మార్గమని, దోమతెరలు వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రత్నకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.