సత్యసాయి: మడకశిర నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవిని మడకశిర MLA, టీటీడీ పాలకమండలి సభ్యుడు ఎం.ఎస్.రాజు కోరారు. గురువారం అసెంబ్లీలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో లో ఓల్టేజీ సమస్యలతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, అవసరమైన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి: మంత్రికి వినతి


