హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెట్టేకల్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

KRNL: ఆదోని మండలం నెట్టేకల్ గ్రామ సమీపంలోని మూడవ మోరీ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గురువారం వెలుగుచూసింది. శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తాలూకా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.