ప్రకాశం: కంభం మండలం కందులాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్మాణాత్మక మూల్యాంకనం (FA-1) పరీక్షలను ఎంఈఓ అబ్దుల్ సత్తార్ బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలిస్తూ పాఠ్యాంశాలను కంఠస్థం చేయకుండా అర్థం చేసుకుని జీవితంలో అన్వయించుకోవాలని సూచించారు. 7, 8వ తరగతి విద్యార్థులను పాఠ్యాంశాలపై ప్రశ్నించి వారి అవగాహనను పరీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
'పాఠ్యాంశాలను అర్థం చేసుకుని నేర్చుకోవాలి'


