హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

KDP: అట్లూరు (M) ఎస్‌.వెంకటాపురంలో విషాదం చోటుచేసుకుంది. తూడారు కాలనీకి చెందిన హరిబాబు, సౌజన్య దంపతుల రెండేళ్ల కుమార్తె వేదశ్రీ ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి మృతి చెందింది. మంగళవారం సాయంత్రం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారి నీటి తొట్టిలో పడిపోయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.