హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏఈ కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం గాలింపు

KKD: కాకినాడకు చెందిన రైఫిల్ షూటింగ్ శిక్షకుడు షేక్. సాధిక్ ఖాన్ వేధింపులు తాళలేక రాజమండ్రి వంతెన పైనుంచి గోదావరిలో దూకిన పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసి బంధువులకు అప్పగించారు. ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్యల ఆచూకీ కోసం SRF, మత్స్యకారులు, అగ్నిమాపక సిబ్బంది రాజమండ్రిలోని దోబీఘాట్ ప్రాంతం నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకు ముమ్మరంగా గాలిస్తున్నారు.