హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రావణ మాసం.. విశాఖలో పూల ధరలు ఇలా

VSP: శ్రావణ మాసం సందర్భంగా విశాఖలోని మార్కెట్లలో వినియోగదారులు పూలు, పండ్లు అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్ పెరగడంతో ధరలకు రెక్కలొచ్చాయి. కేజీ చామంతి రూ.600, గులాబీ రూ.500, మల్లె పూలు రూ.1500, జాజులు రూ.1200 పలుకుతున్నాయి. మూర మల్లె పూలు రూ.160, కనకంబరం రూ.170,జాజులు రూ.130, బంతి దండ రూ.60, కలువ పువ్వు (ఒకటి) రూ.20 చొప్పున అమ్ముడవుతున్నాయి.