హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెల్లిగెడ్డ వంతెనకు పట్టిన దుస్థితి

VZM: రాజాం మండలం అంతకాపల్లి పంచాయతీ పరిధిలోని మొగిలివలస- అంతకాపల్లి గ్రామాల మధ్య రెల్లిగెడ్డ వంతెన శిథిలావస్థకు చేరింది. వంతెన పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు ఇరువైపులా మొక్కలు పెరిగి రహదారి కనిపించకుండా పోయింది. దీంతో వాహనదారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షకాలంలో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. మురుగు వాసనతో ఇబ్బందులు తప్పడంలేదు.