హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లె అభివృద్ధి పనులపై సీఎంకు వినతి

అన్నమయ్య: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై సీఎంకు వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఎమ్మెల్యే వెంట సంబంధిత నాయకులు ఉన్నారు.