సత్యసాయి: మడకశిర నియోజకవర్గంలో దేవాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యుడు ఎం.ఎస్.రాజు కోరారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమరావతిలో మంత్రిని కలసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో పలు హిందూ దేవాలయాల నిర్మాణానికి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి ఆనంతో మడకశిర ఎమ్మెల్యే భేటీ


