W.G: YCP ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకల ఆరోపణలు, సిట్ నివేదికలోని అంశాలపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అభ్యర్థుల భవిష్యత్తుతో చలగాటమాడిన వారిని వదిలిపెట్టకూడదన్నారు.
ఆంధ్రప్రదేశ్
గ్రూప్-1పై సమగ్ర దర్యాప్తు చేయాలి: ఆరిమిల్లి


