E.G: సీతానగరం మండలం కూనవరం గ్రామానికి వెళ్లే కోరుకొండ – కూనవరం ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. గతంలో డబుల్ రోడ్డు పనులు ప్రారంభించి మధ్య లోనే నిలిపివేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఐదేళ్లుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో పాటు తాగునీటి సమస్యతో గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అధ్వానంగా మారిన కోరుకొండ- కూనవరం రహదారి


