హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గల్లంతైన రవితేజ మృతదేహం లభ్యం

E.G: పెరవలి మండలం ముక్కామల వద్ద బాపన్న కాలువలో స్నానానికి వెళ్లి గల్లంతైన శ్రీరవితేజ (41) మృతదేహం బుధవారం పెనుగొండ మండలంలో లభ్యమైనట్లు MRO నిరంజన్ తెలిపారు. మృతుడు కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెరవలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.