SKLM: నరసన్నపేటకు చెందిన నవీన్ ఇటీవల డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని కోర్టులో హాజరుపరచగా జడ్జి ఎస్. వాణి రూ . 10 వేలు జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చినట్లు SI గణేశ్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని మద్యం సేవించి వాహనాలు నడపవద్దని కోరారు.
ఆంధ్రప్రదేశ్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రూ.10 వేల జరిమానా


