హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 22న ఇండస్ట్రీ కనెక్ట్ డ్రైవ్

తిరుపతిలోని SBB మెడికేర్‌లో ఈ నెల 22న ఉద్యోగ అవకాశాల కోసం ఇండస్ట్రీ కనెక్ట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యా భివృద్ధి అధికారి లోకనాథం తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ, MBA విద్యార్హతలు కలిగిన 18-35 ఏళ్ల అభ్యర్థులు హాజరుకావచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.