హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసులు కొట్టారని యువకుడి ఆత్మహత్యాయత్నం

అన్నమయ్య: మన్నూరు సీఐ కొట్టారనే మనస్తాపంతో నవీన్‌కుమార్‌రెడ్డి అనే యువకుడు విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు అతడిని కడప రిమ్స్‌కు తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై సీఐ లింగప్ప మాట్లాడుతూ.. ఫిర్యాదు మేరకు విచారణ చేశామని, యువకుడిని తాము కొట్టలేదని తెలిపారు.