E.G: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం తెలిపారు. జిల్లాలోని 342 పంచాయతీలు, 4,040 వార్డుల పరిధిలో మొత్తం 13,43,601 మంది ఓటర్లు ఉన్నారని ఆమె కలెక్టరేట్‌లో వెల్లడించారు. ఈ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆమె స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 13.43 లక్షల మంది ఓటర్లు: కలెక్టర్


