హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కోడుమూరులో జాబ్ మేళా!

KRNL: కోడుమూరు వివేకానంద డిగ్రీ కళాశాలలో గురువారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. వివిధ కంపెనీల్లో 460 ఉద్యోగ ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హత కలిగిన 18-35 ఏళ్ల వారు హాజరుకావచ్చన్నారు. ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని తెలిపారు.