కోనసీమ: నగరం PHCని DM&HO డాక్టర్ దుర్గారావు దొర బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అప్పటి వరకు వైద్యురాలు విధులకు హాజరుకాకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని స్పష్టం చేస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
వైద్యురాలి గైర్హాజరుపై DM&HO ఆగ్రహం


