కృష్ణా: మచిలీపట్నం మండలం తల్లాపాలెం వైఎస్ఆర్ ఫిషర్ మెన్ కాలనీకి చెందిన మత్స్యకారుడు పల్లేటి రాజు (20) అగస్టు 15న సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతై మృతి చెందాడు. బాధితుడి కుటుంబాన్ని మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించి, తక్షణసాయంగా రూ.25 వేల చెక్కు అందజేశారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని భోరోసానిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబానికి మంత్రి భరోసా


