NLR: పొదలకూరు-1 గ్రామ సచివాలయంలో గురువారం ఆధార్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. నూతన ఆధార్ కార్డులు నమోదు చేయడం, ఆధార్ కార్డులో చేర్పులు మార్పులు, ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ చేయుట, తదితర సేవలు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పొదలకూరులో ఆధార్ క్యాంప్


