హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెట్ల కిందే విద్యార్థుల చదువులు

NLR: వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల కొరతతో విద్యార్థులు చెట్ల కిందే చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పాఠశాలలో సుమారు 70 మంది విద్యార్థులకు కేవలం రెండు తరగతి  గదులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయులు కొన్ని తరగతులను చెట్ల నీడలో నిర్వహిస్తున్నారు.