హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలి ఐతానగర్‌లో మృతదేహం లభ్యం

GNTR: తెనాలి ఐతానగర్‌ శివారులో ఈ నెల 16న లభ్యమైన గుర్తుతెలియని మృతదేహం ఉడ్‌ పాలిష్‌ వర్కర్‌ పులివర్తి పార్వతీశ్వర్‌ అలియాస్‌ పార్ధు(21) దేనని కుటుంబసభ్యులు నిర్ధారించారు. గత నెల 31న పనికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. మృతదేహం వద్ద లభించిన చెప్పులు, తాయత్తును బట్టి గుర్తించారు. మృతికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.