కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో బుధవారం ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. 34 రోజులకు గాను ఆలయ ప్రధాన హుండీల ద్వార రూ. 2,97, 95,990 ఆదాయం, బంగారం 18 గ్రాములు, వెండి 1024 గ్రాములు, వివిధ దేశాలకు చెందిన కరెన్సీ లభించాయని ఈవో చక్రధర్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం రూ. 2.97కోట్లు


