హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

SKLM: మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాలో రాజకీయ సందడి మొదలుకానుంది. జిల్లాలోని శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్చాపురం, పలాస పట్టణ స్థానిక సంస్థల్లో త్వరలోనే ఎన్నికల నగారా మోగే అవకాశం ఉంది. పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమమైంది.