హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీచర్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

ATP: SEPT 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO అయూబ్ హుస్సేన్ తెలిపారు. ప్రభుత్వ, జడ్పీ, పురపాలక, కేజీబీవీ పాఠశాలల్లో 10 ఏళ్ల బోధన అనుభవం ఉన్నవారు అర్హులు. గతంలో అవార్డు పొందినవారు, క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్నవారు అనర్హులు. ఈ నెల 25లోగా ఎంఈవోలకు దరఖాస్తులు అందజేయాలి.