హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కాపురంలో SIR-2026 స్పెషల్ డ్రైవ్: కలెక్టర్

మార్కాపురం జిల్లాలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ SIR-2026లో భాగంగా ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు బుధవారం కలెక్టర్ విజయ సునీత తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఉ.10గంటల నుంచి సా.5గం.ల వరకు BLOలు అందుబాటులో ఉంటారు. కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు, పేరు, చిరునామా మార్పుల ఫారం-6, 7, 8 ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.