హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రకాశం: విద్యుత్తుశాఖ నిర్వహణ పనుల కారణంగా గురువారం అద్దంకి పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని డీఈఈ దామోదరం తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అద్దంకి మండలం శ్రీనగర్, చైతన్యనగర్, కొత్త పసుమర్తిపాలెం, ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక ప్రాంతం, చిన్నగానుగపాలెంలో కరెంటు ఉండదని పేర్కొన్నారు.