సత్యసాయి: సోమందేపల్లి షిర్డీ సాయిబాబా ఆలయం వద్ద ఈ నెల 20 నుంచి 25 వరకు ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నారు. శంకర్ నేత్రాలయం చెన్నై సంచార సర్జికల్ యూనిట్ వైద్యులు కంటి పరీక్షలు, శుక్లం శస్త్రచికిత్సలు చేస్తారు. కంటి సమస్యలున్నవారు ఆధార్ కార్డుతో పాటు గత వైద్య పరీక్షల పత్రాలు తీసుకురావాలని తహసీల్దార్ మారుతి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సోమందేపల్లిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం


