ASR: మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన శక్తి యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని హుకుంపేట సీఐ విజయ్ కుమార్ సూచించారు. హుకుంపేట మండలం ఉప్ప గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఎస్సై దుర్గా ప్రసాద్‌తో కలిసి సందర్శించారు. విద్యార్థినులకు అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తుల వల్ల భయాందోళనకు గురైనప్పుడు శక్తి యాప్ ద్వారా రక్షణ పొందవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
శక్తి యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి


