హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

28 మంది బీఎల్‌వోలకు షోకాజ్ నోటీసులు

KRNL: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న 28 మంది బీఎల్‌వోలకు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. SIR ప్రక్రియలో ఫారం 6, 7, 7A, 8లను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయడంలో జాప్యం, విధుల పట్ల నిర్లక్ష్యంపై నోటీసులు ఇచ్చినట్లు సహాయ ఎన్నికల నమోదు అధికారి, అదనపు కమిషనర్ ఆర్జీవీ కృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. 24గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.