కృష్ణా: గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎంపీడీవో ఇమ్రాన్ తెలిపారు. ఎంపీపీ కొడాలి సురేశ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మండలంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సమీక్షించనున్నట్లు తెలిపారు. మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం


