హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటీఐల 3వ విడత కౌన్సెలింగ్

కృష్ణా: 2026-28 విద్యా సంవత్సరానికి గుడివాడలో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు మూడవ విడత కౌన్సెలింగ్‌ను ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా అడ్మిషన్ల కన్వీనర్ మంజులా దేవి తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు 08674-295953, 8555952320 సంప్రదించాలన్నారు.