హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురంలో సీఎం చంద్రబాబుకు పాలాభిషేకం

ATP: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీ, బీసీ విభాగం నేతలు హర్షం వ్యక్తం చేశారు. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచన మేరకు టవర్ క్లాక్ వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీసీలకు రాజ్యాధికారం తెదేపాతోనే సాధ్యమని నాయకులు స్పష్టం చేశారు.