హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రవాణా శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

ATP: రోడ్లు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో స్త్రీ శక్తి పథకం వల్ల పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు ఆర్టీసీ బస్సులు కేటాయించాలని, రద్దీ వేళల్లో అదనపు ట్రిప్పులు నడపాలని కోరారు. నిలిచిపోయిన గ్రామీణ సర్వీసులు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.