హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాల మున్సిపల్‌ కమిషనర్‌ శేషన్న బదిలీ

NDL: నంద్యాల మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న శేషన్న బదిలీ అయ్యారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆయనను రిలీవ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఆయన స్థానంలో నాగభూషణం రెడ్డికి ప్రభుత్వం ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో త్వరలో నూతన ఇన్‌చార్జి కమిషనర్‌ నాగభూషణం రెడ్డి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.