కోనసీమ: రావులపాలెంలోని శ్రీసత్యసాయి సేవా మందిరంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సంస్థ కన్వీనర్ మన్యం పర్వ తవర్థనరావు తెలిపారు. ఉదయం హోమియో, మధ్యాహ్నం 3 గంటల నుంచి చర్మవ్యాధులు, దంత వైద్య పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. పరిసర ప్రాంతాలలోనూ ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉచిత వైద్య శిబిరానికి ఆహ్వానం


