హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్యాంక్ అధికారి పేరుతో సైబర్ మోసం

NTR: నిడమనూరుకు చెందిన రవివర్మకు సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అధికారి పేరుతో ఫోన్ చేసి, క్రెడిట్ కార్డు వివరాల కోసం వాట్సాప్‌లో ఏపీకే ఫైల్ పంపారు. ఆ ఫైల్‌లో వివరాలు నమోదు చేయగానే ఫోన్ హ్యాక్ అయింది. దీంతో రెండు క్రెడిట్ కార్డుల నుంచి రూ.2,64,950 డెబిట్ అయ్యాయి. బాధితుడు పటమట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.