హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేలకూలే స్థితిలో విద్యుత్ స్తంభాలు

KKD: కొత్తపల్లి మండలం మూలపేట గ్రామం నుంచి నాగులపల్లికి వెళ్లే మార్గంలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా వాలిపోయి దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు నేలకూలుతాయోనని ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను పరిశీలించి, అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.