హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ మహిళా కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ

VSP: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, PMKVY, స్కిల్ హబ్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ విజయబాబు తెలిపారు. బీటెక్, బీఎస్సీ, ఇతర అర్హతలున్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 28 లోపు కళాశాలలోని స్కిల్ హబ్‌లో దరఖాస్తులు అందజేయాలని అధికారులు కోరారు.