హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రామాలయ అభివృద్ధి పనులు పరిశీలన

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ అభివృద్ధి పనులను బుధవారం టీటీడీ జేఈవో డాక్టర్ శరత్ పరిశీలించారు. కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న పనులతో పాటు టీటీడీ నిర్మించనున్న 100 గదుల వసతి గృహానికి కేటాయించనున్న స్థలాన్ని, పురావస్తు శాఖ చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆలయంలో సీతారామ లక్ష్మణుల మూలవిరాట్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.