KDP: ఒంటిమిట్ట ఎస్సై వి. శ్రీనివాసులపై జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రశంసలు కురిపించారు. సిద్ధవటం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన హత్యాయత్నం, పసిపిల్ల మిస్సింగ్ కేసులను సమర్థవంతంగా ఛేదించి పరిష్కరించడంలో ఎస్సై ప్రత్యేక ప్రతిభ కనబరిచారని ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం శ్రీనివాసులకు ప్రశంస పత్రాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సై శ్రీనివాసులకు ఎస్పీ ప్రశంసలు


