హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KDP: పులివెందులలో గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈఈ జగదీశ్వరరెడ్డి తెలిపారు. 33/11 కేవీ కోతి సమాధి సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ పార్నపల్లి రోడ్డు, రాజీవ్‌నగర్ ఫీడర్ల పరిధిలో రోడ్డు వైండింగ్ పనులకు సంబంధించి లైన్ల షిఫ్టింగ్ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.