ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రాజర్షి గూడలో జిల్లా ఉపాధి కల్పనా అధికారి మిల్కా ఆధ్వర్యంలో బుధవారం ఉద్యోగాల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన 11 మంది ఆదివాసీ యువకులు పట్టణంలోని స్పిన్నింగ్ మిల్ లో ఉద్యోగాలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. వారిని ఈనెల 20 తేదీన ఉద్యోగాల్లో చేరాలని నిర్వాహకులు తెలియజేశారు.
తెలంగాణ
ఉద్యోగాల కోసం స్పెషల్ డ్రైవ్.. 11 మంది ఎంపిక!


