ADB: పంటల సంరక్షణపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి రవీందర్ సింగ్ అన్నారు. బుధవారం జైనథ్ మండలంలోని కంట గ్రామంలో పర్యటించి రైతులతో కలిసి పంటలను పరిశీలించారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండి, తక్కువ పెరిగిన సోయా, పత్తి పంటలపై యూరియా పిచికారి చేయాలన్నారు. సోయాలో కాండం తొలుచు పురుగు నివారణకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'పంటల సంరక్షణపై అప్రమత్తంగా ఉండాలి'


